ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి, ఈ నెల 20న జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లను సమీక్షించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు, సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆధునిక ఏఐ టెక్నాలజీని వినియోగించాలని మంత్రి ఆదేశించారు.ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.భక్తుల సౌకర్యార్థం 10 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
