మ్యాన్‌హోల్‌లో అస్థిపంజరం

June 13, 2026 3:56 PM
Skeleton found inside a manhole during GHMC cleaning operations in Katedan, Hyderabad.

వర్షాకాలం ముందు శుభ్రపరిచే పనుల్లో వెలుగులోకి Skeleton

మృతదేహం ఎవరిదన్న దానిపై పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌: నగరంలోని మైలార్దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కాటేదాన్‌ ఓల్డ్‌ కర్నూలు రోడ్డులో మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఓ మ్యాన్‌హోల్‌ను తెరిచి పరిశీలించగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో Skeleton కనిపించింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది.

వర్షాకాలం దృష్ట్యా మ్యాన్‌హోల్స్‌ శుభ్రపరిచే పనులు చేపట్టిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అస్తిపంజరాన్ని గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మైలార్దేవ్‌పల్లి పోలీసులకు విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Skeleton స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో అది పురుషుడిదా లేదా మహిళదా, ఆ వ్యక్తి ఎంతకాలం క్రితం మృతిచెందారనే వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్ని కోణాల్లో విచారణ

ఆ వ్యక్తి మరణం సహజమా, ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా నేరానికి సంబంధించినదా అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అస్తిపంజరం మ్యాన్‌హోల్‌లోకి ఎలా చేరింది, ఎంతకాలంగా అక్కడే ఉంది, దాని వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

Also read,


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media