తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించాలని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ దేశాల్లోని ప్రవాస తెలుగు వారు ఏర్పాటు చేసిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

NTR కేవలం నటుడు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన దూరదృష్టి గల నేత అని స్పీకర్ కొనియాడారు. ఆయనతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
మే 8న బహ్రెయిన్‌లో నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణం మహోత్సవానికి హాజరుకావాలని నిర్వాహకులు స్పీకర్‌ను కోరారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో పాటు అయ్యన్నపాత్రుడు గారిని కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో గల్ఫ్ దేశాల నుండి రఘునాథ్, హరిబాబు, వెంకట్ కొడూరి, వర ప్రసాద్ తదితర తెలుగు ప్రముఖులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
