నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ రోడ్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న అక్రమ నిర్మాణాలు, దుకాణాలను తొలగించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకోవడం వల్ల ప్రజలు రహదారిపై నడవాల్సి వస్తోందని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు. నగరంలో పాదచారుల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తామని చెప్పారు.ప్రజలు కూడా ఫుట్‌పాత్‌లను ఆక్రమించకుండా సహకరించాలని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
