AP: ₹4.64 కోట్ల తో లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం అభివృద్ధి

April 13, 2026 3:24 PM

కనెక్టివిటీ పెంపుతో శ్రీకాకుళం జిల్లాను లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

పెద్దపాడు సమీపంలోని చెన్నై–కలకత్తా జాతీయ రహదారిపై ₹4.64 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కల్వర్ట్ పనులకు ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు.వర్షాకాలంలో వరదల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు. పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు పెంపుతో ఐటీ మరియు పరిశ్రమలు జిల్లాకు చేరువ అవుతాయని మంత్రి వివరించారు.జాతీయ రహదారిని నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు విస్తరించే పనులు కొనసాగుతున్నాయని, నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు విస్తరణ చేపట్టనున్నట్లు చెప్పారు. అదనంగా జిల్లాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, కూడళ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.శ్రీకాకుళం నుంచి తిరుపతికి కొత్త రైలు సర్వీసు ప్రారంభం కావడం జిల్లాకు మరో ముఖ్యమైన అడుగుగా మంత్రి పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media