శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ప్రారంభమైన రోప్‌వే సేవలు!

August 28, 2026 9:49 AM

పాతాళ గంగకు రోప్‌వే సేవలు పునఃప్రారంభం

నిర్వహణ పనుల కారణంగా గత 30 రోజులుగా నిలిపివేసిన శ్రీశైలం పాతాళ గంగ టూరిజం రోప్‌వే సేవలను అధికారులు మళ్లీ ప్రారంభించారు.

దీంతో భక్తులు, పర్యాటకులు ఇకపై యథావిధిగా రోప్‌వేను వినియోగించుకోవచ్చు.

క్యాబిన్లు, రోప్స్, మిషన్స్‌కు మెయింటెనెన్స్

నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాతాళ గంగకు పుణ్యస్నానాల కోసం వెళ్లే భక్తుల సౌకర్యం కోసం రోప్‌వే సేవలను తిరిగి అందుబాటులోకి తెచ్చినట్లు రోప్‌వే మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు.

గత 30 రోజులుగా క్యాబిన్లు, రోప్స్, మిషన్స్‌కు మెయింటెనెన్స్ పనులు నిర్వహించినట్లు చెప్పారు.

మరో 10 ఏళ్ల వరకు ఇబ్బందులు ఉండవు

ఏపీ టూరిజం డెవలప్మెంట్‌లో భాగంగా ఈ రోప్‌వేను ప్రారంభించి సుమారు 20 సంవత్సరాలు పూర్తయిందని పెంచల్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం శ్రీశైలానికి భక్తుల తాకిడి స్వల్పంగా ఉండటంతో గత నెల 23 నుంచి మెయింటెనెన్స్ పనులు చేపట్టినట్లు చెప్పారు.

నిర్వహణ పనులు పూర్తవడంతో మరో 10 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media