Supreme Court of India ముస్లిం మహిళలకు సమాన వారసత్వ హక్కులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. శరియా వారసత్వ చట్టం మహిళలకు వివక్ష చూపుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ దేశంలో అన్ని మహిళలకు సమాన హక్కులు కల్పించాలంటే Uniform Civil Code (UCC) ఒక పరిష్కారం కావచ్చని కోర్టు పేర్కొంది.

ముఖ్య న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. శరియా చట్టంలోని వారసత్వ నిబంధనలు రద్దు చేస్తే కొత్త చట్టం లేకపోవడం వల్ల చట్టపరమైన ఖాళీ ఏర్పడే అవకాశం ఉందని కోర్టు సూచించింది. అందుకే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం పార్లమెంట్ వంటి శాసనసభాధికార పరిధిలోకి వస్తుందని తెలిపింది.పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ, వారసత్వ హక్కు ఒక సివిల్ హక్కు కాబట్టి ముస్లిం మహిళలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలని పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది.
