తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుమారుడి వివాహ వేడుకకు ఏపీ ప్రముఖులను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం అమరావతికి వచ్చిన ఆయన, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని సీఎం చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో పలువురు ఏపీ మంత్రులను భట్టి విక్రమార్క కలిశారు. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బయటకు వచ్చి భట్టి విక్రమార్క నుంచి వివాహ పత్రికను అందుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ను భట్టి విక్రమార్క ఆప్యాయంగా పలకరించి, వివాహానికి తప్పనిసరిగా రావాలని కోరారు.కుటుంబ వేడుక ద్వారా ఇరు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య ఈ భేటీ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.

