AP CM చంద్రబాబును కలిసిన తెలంగాణ Dy CM భట్టి విక్రమార్క

February 27, 2026 4:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న వారికి సీఎం సాదర స్వాగతం పలికారు.

మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాల్సిందిగా భట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లి ఆహ్వానంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు అంశాలపై నేతలు కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం. భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media