TG :నీళ్ల పేరుతో కాంగ్రెస్, BRS పొలిటికల్ డ్రామాలు: బండి సంజయ్

January 8, 2026 4:17 PM

తెలంగాణకు నదీ జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పచ్చి మోసానికి పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. గురువారం కరీంనగర్ రేకుర్తిలోని శుభం గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నీటి వాటాలను ఆ రెండు పార్టీలు కలిసి అప్పనంగా ధారాదత్తం చేశాయని మండిపడ్డారు.

6 గ్యారంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్, అవినీతిపై విచారణ రాకుండా బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. ఉమ్మడి ఏపీలో కృష్ణా నదిలో 811 టీఎంసీల వాటా ఉంటే, తెలంగాణకు ఏనాడూ 200 టీఎంసీలకు మించి వాడకుండా కాంగ్రెస్ మోసం చేసింది.

గోదావరిలో 1486 టీఎంసీల వాటా ఉన్నా.. తెలంగాణలో కనీసం 500 టీఎంసీలు కూడా వాడుకోకుండా ఈ రెండు పార్టీలు అన్యాయం చేశాయి. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తీరుపై ఉద్యమించింది కేవలం బీజేపీ మాత్రమే. కేసీఆర్ మెడలు వంచి ప్రాజెక్టులపై ఒత్తిడి తెచ్చింది మేమే. తెలంగాణకు అన్యాయం జరగొద్దని కేంద్రమే అనేక సమావేశాలు నిర్వహించింది. రాయలసీమ ఎత్తిపోతల వంటి అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంది కేంద్రమేనని సంజయ్ గుర్తుచేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media