Warangalలోని Greater Warangal Municipal Corporationకు చెందిన చెత్త తరలింపు వాహనాలు డీజిల్ లేక నిలిచిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్‌కు సుమారు రూ.2.50 కోట్ల బకాయిలు ఉండటంతో పెట్రోల్ బంకులు ఇంధన సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం.
సెంట్రల్ జైలు ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి అందుతున్న డీజిల్, పెట్రోల్ సరఫరాను జైళ్ల శాఖ అధికారులు నిలిపివేశారు. పాత బకాయిలు చెల్లిస్తేనే ఇంధనం అందిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు.దీంతో చెత్త తరలింపు వాహనాలు, దోమల నియంత్రణకు ఉపయోగించే ఫాగింగ్ యంత్రాలు నిలిచిపోవడంతో నగరంలో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
