TG:కామారెడ్డిలో పిచ్చికుక్క దాడి.. ఐదుగురికి గాయాలు

March 10, 2026 2:41 PM

Kamareddy జిల్లాలో పిచ్చికుక్క దాడి కలకలం రేపింది. Domakonda మండల కేంద్రంలోని మటన్ మార్కెట్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారులు సహా మరో ముగ్గురిపై పిచ్చికుక్క దాడి చేయడంతో ఐదుగురికి గాయాలయ్యాయి.

దాడిలో చిన్నారులు భవ్యశ్రీ (8), ద్రాక్షాయిని (9)లకు ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురు దోమకొండ యాదమ్మ, మ్యాదరి యాదమ్మ, తీగ లక్ష్మిలు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే Kamareddy ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరు చిన్నారులను మెరుగైన చికిత్స కోసం Hyderabadకు తరలించారు.గ్రామంలో పిచ్చికుక్కల సమస్యపై పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే పిచ్చికుక్కలను తరిమికొట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media