ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జనసంద్రం మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. మియాపూర్ న్యూ కాలనీ శివాలయం నుండి తారా నగర్ తుల్జాభవాని ఆలయం వరకు జరిగిన మహా ర్యాలీలో వేలాది మంది భక్తులు, యువత పాల్గొని “జై శివాజీ – జై భవానీ” నినాదాలతో హోరెత్తించారు.

BJP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవికుమార్ యాదవ్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. శివాజీ మహారాజ్ జయంతి ధర్మ రక్షణకు జరిగిన మహాప్రతిజ్ఞ అని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాశీ, అయోధ్యల పునర్నిర్మాణం శివాజీ చూపిన బాటలోనే సాగుతున్నాయని కొనియాడారు. శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధతంత్రం, నౌకాదళ పటిష్టత నేటికీ మన సైన్యానికి స్ఫూర్తిదాయకమని, ఆయనను ఆదర్శంగా తీసుకుని దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ప్రతినిధులు, బీజేపీ శ్రేణులు మరియు శివాజీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
