ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

February 7, 2026 1:54 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం ప్రొద్దుటూరు పట్టణంలో పర్యటించారు. ప్రొద్దుటూరు – మైదుకూరు రోడ్డులో ఉన్న AR&BCVR ట్రావెల్స్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రికి, సంస్థ యాజమాన్యం ఘన స్వాగతం పలికింది.

AR&BCVR ట్రావెల్స్ యజమానులు శ్రీనివాసులు రెడ్డి, సురేష్ రెడ్డి, సూర్య ప్రతాప్ రెడ్డిల ఆహ్వానం మేరకు విచ్చేసిన మంత్రిని సంస్థ తరఫున శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రవాణా రంగంలోని ప్రస్తుత పరిస్థితులు, ట్రావెల్స్ ఆపరేటర్ల సమస్యలపై మంత్రి యాజమాన్యంతో కాసేపు ముచ్చటించారు. రవాణా రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మరియు ట్రావెల్స్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media