RTC సమ్మె విరమణ.. తిరిగి రోడ్డెక్కిన బస్సులు

April 25, 2026 10:27 AM

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మంత్రుల బృందం మరియు జేఏసీ నాయకుల మధ్య సుమారు 12 గంటల పాటు జరిగిన చర్చలు సఫలమవడంతో కార్మికులు విధుల్లోకి చేరారు.

అర్థరాత్రి నుంచే కొన్ని సర్వీసులు ప్రారంభం కాగా, ఉదయం నుంచి అన్ని బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. గత మూడు రోజులుగా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడిన ప్రయాణికులకు ఈ నిర్ణయం భారీ ఊరటనిచ్చింది.ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య చర్చలు సానుకూలంగా ముగియడంతో రవాణా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media