విమాన ప్రయాణికులకు తక్కువ ధరల్లో ఆహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్ యాత్రి కేఫ్‌లు’ను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ కేఫ్‌లలో టీ ₹10కి, కాఫీ ₹20కి అందించడంతో పాటు తక్కువ ధరలకే స్నాక్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా 57 విమానాశ్రయాల్లో ప్రారంభించారు. తాజాగా లక్నో విమానాశ్రయంలో కూడా ఈ సేవలు ప్రారంభమయ్యాయి.కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ విస్తరణను ధృవీకరించగా, ముంబై విమానాశ్రయంలో కేఫ్‌ను సందర్శించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ చొరవను ప్రశంసించారు. ప్రయాణికులకు చౌక ధరల్లో నాణ్యమైన ఆహారం అందించడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు.
