Londonలో తెలుగు విద్యార్థిపై Abuse స్వదేశానికి తిరిగి వచ్చిన వైనం

April 23, 2026 11:54 AM

University of Hertfordshireలో చదువుతున్న Prasad Reddy అనే తెలుగు విద్యార్థిపై దుర్వ్యవహారం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2026 జనవరిలో యూకేకు వెళ్లి మాస్టర్స్ చదువులు ప్రారంభించిన ఆయన, హాస్టల్ వ్యవహారంపై జరిగిన మీటింగ్ సమయంలో యూనివర్సిటీ సిబ్బంది నుంచి అవమానకర వ్యాఖ్యలు, వర్బల్ అబ్యూస్ ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన తర్వాత పరిస్థితులు తీవ్రంగా మారి, యూనివర్సిటీ అధికారులు ఆయనను భారత్‌కు తిరిగి పంపినట్లు సమాచారం. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ యూనివర్సిటీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబం పేర్కొంది.ప్రస్తుతం Hyderabadలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్ర‌సాద్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. తీవ్ర ఒత్తిడి కారణంగా న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆయన విద్యా భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.ఇక ఈ ఘటనపై తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని, భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో కుటుంబం లీగల్ చర్యలు చేపట్టే అవకాశముంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media