ఉత్తరప్రదేశ్లోని హర్దోయిలో ఉన్న ప్రైవేట్ స్కూల్ “New Sunbeam”లో వివాదం నెలకొంది. స్కూల్ ప్రిన్సిపల్ Mamta Mishra ఒక పేరెంట్తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పేరెంట్ Neelam Verma తెలిపిన వివరాల ప్రకారం, వాదన సమయంలో ప్రిన్సిపల్ పలుమార్లు “shut up” అని అరవడంతో పాటు, వెంటనే పిల్లవాడిని స్కూల్ నుంచి తీసుకెళ్లాలని సూచించినట్లు ఆరోపించారు.అదే సమయంలో “bloody fool”, “gawar” వంటి పదజాలాన్ని ఉపయోగించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు అధికారికంగా ఫిర్యాదు చేయగా, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ప్రైవేట్ విద్యాసంస్థల ప్రవర్తన, ఫీజులు తీసుకుంటూ తల్లిదండ్రులపై వ్యవహరించే తీరు పై ఈ సంఘటన చర్చకు దారి తీసింది.
