హైదరాబాద్‌లోని Uppalలో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మిస్టరీగా మారింది. ఫిబ్రవరి 28న పట్టపగలు జరిగిన ఈ ఘటనలో అఖిల్ (28) అనే యువకుడు తీవ్రంగా గాయపడి, మార్చి 4న చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అఖిల్ తన స్నేహితుడితో రోడ్డు దాటుతుండగా నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. అయితే ఇప్పటికీ నిందితుడి జాడ దొరకకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, వాటి ఆధారంగా కూడా నిందితుడిని గుర్తించలేకపోవడం పై బాధిత కుటుంబం పోలీసులపై నిర్లక్ష్య ఆరోపణలు చేస్తోంది. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.“ఇది కేవలం ప్రమాదమా లేదా పన్నిన కుట్రా?” అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కోసం అఖిల్ కుటుంబం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషించి నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
