వికారాబాద్ (బీఎన్ఎస్): పన్నుల వసూళ్ల కోసం వికారాబాద్ మునిసిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కొత్త ప్రయోగం చేపట్టారు. టాక్స్ కట్టని సంస్థల దగ్గర మునిసిపాలిటీ చెత్త వాహనాలను నిలిపివేస్తున్నారు. తాజాగా 5 సంవత్సరాల నుండి పన్ను కట్టని పెట్రోల్ బంక్ చుట్టూ చెత్త ట్రాక్టర్లను నిలిపి పెట్టారు. మున్సిపల్ కు చెల్లించాల్సిన 82 000 రూ “ల టాక్స్ ను చెల్లించకపోవడంతో వినూత్నంగా ఒత్తిడి పెంచారు. దీంతో పెట్రోల్ బంక్ యజమాని దిగి వచ్చి, పన్ను చెల్లించేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నోటీసులు జారీచేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మున్సిపల్ చెత్తతో కూడుకున్న వాహనాలను అడ్డంగా పెట్టి నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే మిగతా టాక్స్ చెల్లించని భవన యజమానుల ఇళ్ళ ముందు నిరసనలు కొనసాగిస్తామని అన్నారు.