తెలుగు నాట మహిళలను అన్నయ్య లా చూసుకొనే నాయకుడు వైయస్ జగన్ అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. గత ప్రభుత్వంలో అనేక పదవులు మహిళలకు కేటాయించి ప్రోత్సహించారు అని గుర్తు చేశారు. వరుదు కళ్యాణి విశాఖపట్నం లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నందుకు పార్టీ మహిళా విభాగం తరపున ధన్యవాదాలు తెలియచేశారు.
