శ్రీకాకుళం జిల్లాలో భారత ఉపరాష్ట్రపతి C. P. Radhakrishnan పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ K V Maheshwara Reddy ఆదివారం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి, బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఉపరాష్ట్రపతి కాన్వాయ్ శ్రీకాకుళం ఆర్&బి అతిథి గృహం నుంచి మిల్లు జంక్షన్, అరసవిల్లి, శ్రీకూర్మం మార్గంలో ప్రయాణించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్గమధ్యంలో ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్ క్లియరెన్స్, ట్రాఫిక్ డైవర్షన్, అదనపు సిబ్బంది మోహరింపు చేపట్టారు.భద్రతా దృష్ట్యా రోడ్ ఓపెనింగ్ పార్టీలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నారు. మొత్తం సుమారు 650 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు.డ్రోన్ల వినియోగంపై పూర్తిగా నిషేధం విధించగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

