ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. మాజీ ఎంపీ Vijayasai Reddy నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టి, కేసుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.2019 నుంచి 2024 మధ్య అమలైన లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, నిధుల మళ్లింపు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది.ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
