ఈడీ సోదాలపై V Vijayasai Reddy తీవ్ర విమర్శలు చేశారు. తన ఇంట్లో ఉద్దేశపూర్వకంగానే సోదాలు నిర్వహించారని ఆరోపించారు.ఇంట్లో ఉన్న రూ.6 లక్షలు తల్లి వైద్య ఖర్చుల కోసం ఉంచినవేనని పేర్కొన్నారు. సోదాలు చేయాల్సింది N Chandrababu Naidu ఇంట్లోనని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఆయనపై రాజకీయంగా పోరాటం కొనసాగిస్తానన్నారు. చంద్రబాబుకి వయసు పెరిగింది..చావుకి దగ్గర అవుతున్నారు-విజయసాయిరెడ్డి జీవిత చరమాంకంలో అయినా మంచిపనులు చేయాలి చంద్రబాబు నెలకు రూ.5 వేల కోట్లు సంపాదిస్తున్నారు ఏడాదికి రూ.6 వేల కోట్లు విదేశాల్లో దాచుకున్నారు చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని..KCR ఎప్పుడో చెప్పారుత్వరలో రాజకీయంగా కొత్త అడుగు వేస్తానని, జూలైలో కొత్త పార్టీ ప్రకటిస్తానని వెల్లడించారు.అలాగే మీడియా రంగంలోకి కూడా ప్రవేశిస్తానని, ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేస్తానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
