ఆంధ్రప్రదేశ్‌లోని Vijayawadaలో అవినీతి నిరోధక శాఖ (ACB) నిర్వహించిన సోదాల్లో భారీ ఆస్తులు బయటపడ్డాయి. స్టేట్ ట్యాక్స్ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు నివాసంలో అధికారులు దాడులు చేపట్టారు.
ఈ సోదాల్లో 760 గ్రాముల బంగారం, దాదాపు 8 కిలోల వెండి, రూ.22 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌తో పాటు భవనం, స్థలాలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.గతంలో రూ.16 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్రీనివాసరావు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
