వన్‌టౌన్ చేపల మార్కెట్ సమీపంలో ఒక ఆటోకు అకస్మాత్తుగా మంటలు అంటుకుని కాలిపోయిన ఘటన కలకలం రేపింది.
చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో డ్రైవర్ ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్ మంటలను గమనించిన వెంటనే ఆటోను ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.జనసంచారం అధికంగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
