RAPURU ఇంటర్ ఫలితాల్లో వినాయక జూనియర్ కాలేజ్ ప్రభంజనం

April 16, 2026 12:20 PM

ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాపూరు పట్టణంలోని వినాయక జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో టాప్ స్థానాలను కైవసం చేసుకుని కళాశాల ప్రతిష్టను పెంచారు.

ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని జాస్మిన్ 1000 మార్కులకు గాను 959 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. ప్రథమ సంవత్సరం విద్యార్థిని ప్రవీణ 470లో 433 మార్కులు సాధించి సత్తా చాటింది.విద్యార్థుల కృషి, అధ్యాపకుల నాణ్యమైన బోధన వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపాల్ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media