Visakhapatnam లో ట్రాఫిక్ చలానాలతో విసిగిపోయిన ఓ తండ్రి తన కుమారుడి బైక్ను తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. వేపగుంట సమీపంలోని బంటాకాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ తన కుమారుడి కోసం ఏడాది క్రితం బైక్ కొనిచ్చాడు.
అయితే కుమారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనం నడపడంతో పలుమార్లు చలానాలు వచ్చాయి. గతంలో జరిగిన ప్రమాదంతో వైద్య ఖర్చుల కోసం తండ్రి సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇటీవల ట్రిపుల్ రైడింగ్ కారణంగా మరోసారి జరిమానా పడడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి, కాలనీకి దూరంగా బైక్ తీసుకెళ్లి దహనం చేశాడు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
