ఉత్తమ అధికారిగా ‘శ్రీ కనక మహాలక్ష్మి’ ఆలయ EO శోభారాణికి

January 27, 2026 2:15 PM

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉపకమిషనర్ మరియు కార్యనిర్వాహనాధికారిణి (EO) శ్రీమతి కె. శోభారాణి ఉత్తమ అధికారిగా ప్రశంసలు అందుకున్నారు.

దేవస్థాన అభివృద్ధిలో, భక్తుల సౌకర్యాల కల్పనలో ఆమె కనబరుస్తున్న చొరవ, అంకితభావాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేసింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న శోభారాణిని పలువురు ప్రముఖులు, ఆలయ సిబ్బంది అభినందించారు. ఆమె పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆలయ పరిపాలనలో పలు సంస్కరణలు తీసుకురావడమే కాకుండా, పారిశుధ్యం మరియు భక్తుల సేవల్లో మెరుగైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media