విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘రోబో పోలీస్’.. దేశంలోనే తొలిసారి!

January 23, 2026 6:08 PM

భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రయాణికుల భద్రత, సహాయం కోసం తొలిసారిగా ఒక హ్యూమనాయిడ్ రోబో పోలీస్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖ స్టేషన్‌లో ప్రవేశపెట్టింది. ‘ASC అర్జున్’ గా పిలిచే ఈ రోబో ఇకపై స్టేషన్‌లో నిరంతరం పహారా కాయనుంది.

ఏఐ (AI), ఐఓటీ (IoT) సాంకేతికతతో పనిచేసే ఈ రోబో.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రయాణికులతో సంభాషిస్తుంది.
ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా చొరబాటుదారులు, పాత నేరస్థులను గుర్తించి వెంటనే ఆర్పీఎఫ్ (RPF) కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ పంపుతుంది.
స్టేషన్‌లో రద్దీని విశ్లేషించడం, అనుమానితుల కదలికలను ట్రాక్ చేయడం మాత్రమే కాకుండా.. పొగ లేదా అగ్నిప్రమాదాలను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించగలదు.
ఈ రోబోను ఆర్పీఎఫ్ బృందం ఏడాది పాటు శ్రమించి పూర్తిగా విశాఖపట్నంలోనే దేశీయంగా అభివృద్ధి చేయడం విశేషం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media