గురువారం పెద్ద ఎత్తున వార్డు సభలు

April 1, 2026 7:05 PM

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 న అన్ని గ్రామ,మున్సిపల్ వార్డు సభలు నిర్వహించాలని ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ లు,తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎపిఓ, ఎపిఎమ్, ఎమ్ పి ఓ లతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు,శాసన సభ్యులు, ఎమ్మెల్సీ లు, ఎంపీu తదితరులు ను ఆహ్వానించి గ్రామ, మున్సిపల్ వార్డు సభలు నిర్వహించి, ఆయా పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులను గుర్తించి వారి ద్వారా వారు పొందిన లబ్ధిపై మాట్లాడించాలన్నారు.. ముఖ్యంగా రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ జీవిత బీమా, పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం వంటి వాటన్నిటిపై తెలియజేయాలని అన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media