పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు కీలక సవరణ బిల్లులపై లోక్‌సభలో నేడు ఓటింగ్ జరగనుంది. మహిళల రిజర్వేషన్ చట్టంలో మార్పులు, అలాగే డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన Constitution (131st Amendment) Bill, 2026ను ఇప్పటికే సభలో ప్రవేశపెట్టారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, ఈ బిల్లులపై సుమారు 12 గంటల పాటు చర్చ జరుగుతుందని, అవసరమైతే స్పీకర్ చర్చ సమయాన్ని పెంచవచ్చని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో సభ్యులను ఉద్దేశించి, మహిళలకు న్యాయం చేయాల్సిన సమయం ఇదేనని, ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ బిల్లుపై విమర్శలు చేస్తూ, ఇది మహిళా సాధికారతకు కాకుండా ఇతర అంశాలను పక్కన పెట్టేందుకు ఉపయోగపడుతోందని ఆరోపించారు.ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఈ బిల్లుపై రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి.
