మహిళల భద్రతే అభివృద్ధికి పునాది: CM రేవంత్ రెడ్డి

April 28, 2026 1:00 PM

హైదరాబాద్‌లో నిర్వహించిన ఐసీసీసీ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మహిళల భద్రత, పిల్లల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉంటుందని, అదే అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.

మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. షీ టీమ్స్, “స్టాండ్ విత్ హర్”, “స్పందన” వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా లక్షలాది మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించామని వివరించారు.

ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో ఇవ్వడం, ఉచిత బస్సు ప్రయాణం, బ్యాంకు రుణాలు, సోలార్ ప్రాజెక్టులు, క్యాంటీన్లు వంటి పథకాల ద్వారా మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.అదే సమయంలో డ్రగ్స్ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. Telangana Police ఆధ్వర్యంలో ఈగల్ ఫోర్స్ ద్వారా డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.సమాజంలో మహిళల భద్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, డ్రగ్స్ నియంత్రణలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media