మత్తు మందు ఇచ్చి కాళ్లు,చేతులు కట్టేసి…

May 14, 2026 4:19 PM

జూబ్లీహిల్స్ లో Retired IPS వినయ్ రంజన్ రే భార్య murder కేసు దర్యాప్తులో ఉండగానే..జవహర్‌నగర్‌లోని కౌకుర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో మరో నేపాలీ నేపాల్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. ప్రొఫెసర్ మురళీధర్ మోహన్,డాక్టర్ విజయలక్షీ దంపతులను కట్టేసి..మత్తుమందు ఇచ్చి 60 తులాల గోల్గ్,వెండి, 30 వేలు దోచుకుపోయింది.ఒక రోజు తర్వాత ఆ దంపతులు మత్తు నుంచి తేరుకుని కిటికీలో నుంచి అరవగా పక్కింటి వాళ్లు వచ్చి తలుపులు తీశారు.
ఒక నేపాల్ జంట 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరింది. ఇటీవలే మరో మహిళ వారి బంధువుగా వచ్చి ఆ ఇంట్లోనే ఉంటుంది.ఆ మహిళ birht day చేసుకుంటామంటే owner అంగీకరించాడు. birht day కోసమంటూ మరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు.రాత్రి ఫ్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తుండగా ఈ నేపాలీ గ్యాంగ్ దాడి చేసింది. కాళ్లు, చేతులు కట్టేసి బెదిరించడంతో మమ్మల్ని చంపకండి మీకు కావాల్సింది తీసుకెళ్లమని కోరారు.దీంతో ఇంట్లో నగలతోపాటు విలువైన వస్తువులను ఈ గ్యాంగ్ దోచుకుపోయింది.ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసి.. అన్ని గేట్లకు తాళాలు వేసి పరారైనట్టు పోలీసులు చెప్పారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media