రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద లిమ్స్ న్యూరో & కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరవ బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహా రెడ్డి, జబర్దస్త్ నటుడు రచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు లిమ్స్ ఆసుపత్రి కృషి చేయాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించాలని ఆయన అన్నారు.లిమ్స్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ రాజ్ మాట్లాడుతూ, శంషాబాద్, షాద్‌నగర్, మహేశ్వరం, చేవెళ్ల ప్రాంతాల ప్రజలకు న్యూరో, కార్డియాక్ వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఈ ఆసుపత్రి లక్ష్యమని తెలిపారు.
