వ్యవసాయ భూమి వివాదంలో న్యాయం కావాలంటూ నిరసన
Siddipet కు చెందిన ఓ దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన దంపతులు
హైదరాబాద్, జూన్ 4:
Siddipet కు చెందిన ఓ దంపతులు బుధవారం తెలంగాణ సచివాలయం సమీపంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వ్యవసాయ భూమి వివాదంలో తమకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ వారు ఈ చర్యకు దిగినట్లు సమాచారం.
వారి వివరాలు వెంటనే తెలియరాలేదు. సచివాలయం వద్ద నిరసన చేపట్టిన దంపతులు, పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వారి కదలికలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.
న్యాయం కావాలంటూ సచివాలయం వద్ద హల్చల్
Siddipetకు చెందిన ఓ దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన దంపతులు,నిప్పంటించుకునేలోపే వారి చేతిలో ఉన్న అగ్గిపెట్టెను పోలీసులు లాక్కొన్నారు. అనంతరం వారిపై నీరు పోసి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.
తర్వాత దంపతులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యామని వారు అధికారులకు చెప్పినట్లు తెలిసింది.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
ALSO READ
సచివాలయం వద్ద ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోలీసులు
సచివాలయం వద్ద జరిగిన ఈ ఘటన కొంతసేపు ఉద్రిక్తతకు దారితీసింది. దంపతులు తమ వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం చాలా కాలంగా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైనట్లు సమాచారం.న్యాయం చేయాలంటూ వారు సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకుని వారిని అడ్డుకున్నారు. అనంతరం నీరు పోసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
దంపతులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. భూమి వివాదం స్వరూపం, సంబంధిత పత్రాలు, వారి ఫిర్యాదులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

