Gachibowli police station పరిధి లో ఘటన
భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
హైదరాబాద్, జూన్ 5: Gachibowli police పరిధి లో పెళ్లై ఏడాది కూడా పూర్తికాకముందే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వరకట్న వేధింపులు భరించలేక 21 ఏళ్ల అనూష గురువారం రాత్రి ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
లో పెళ్లై ఏడాది కూడా పూర్తికాకముందే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వరకట్న వేధింపులు భరించలేక 21 ఏళ్ల అనూష గురువారం రాత్రి ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, అనూష భర్త మద్యం అలవాటుకు బానిసయ్యాడు. తరచూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని తెలిపారు. పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఐదు తులాల బంగారాన్ని తాకట్టు పెట్టడమే కాకుండా, అదనపు వరకట్నం తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడని ఆరోపించారు.
కౌన్సెలింగ్ చేసినా మారని ప్రవర్తన..
ఈ విషయంపై కుటుంబ పెద్దలు పలుమార్లు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కౌన్సెలింగ్ కూడా నిర్వహించినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు.
ఘటన అనంతరం అనూష తల్లి చెన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మరణానికి వరకట్న వేధింపులే కారణమని ఆమె ఆరోపించారు.
ఫిర్యాదు ఆధారంగా Gachibowli police పరిధి లో కేసు నమోదు చేశారు. యువతి మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.
Also read

