API Drug Network అనుమతులు లేకుండా ల్యాబ్ నిర్వహణ
170 గ్రాముల యాంటీవైరల్ ఔషధం స్వాధీనం
హైదరాబాద్, జూన్ 6: API Drug Network పేరుతో కూకట్‌పల్లిలో సాగుతున్న అక్రమ కార్యకలాపాలను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు ఈ వ్యాపారాన్ని శుక్రవారం బయటపెట్టారు.
నిషేధం, ఎక్సైజ్ శాఖతో కలిసి చేపట్టిన సంయుక్త తనిఖీల్లో భాగంగా ప్రశాంతినగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఎన్సీఎస్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న సినిక్స్ ల్యాబ్స్ సంస్థపై అధికారులు దాడులు నిర్వహించారు. సంస్థకు అవసరమైన అనుమతులు లేకుండానే ఏపీఐల కొనుగోలు, అమ్మకాల కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టానికి విరుద్ధమని అధికారులు తెలిపారు.
ఏపీఐ నెట్వర్క్ డ్రగ్ వ్యాపారంపై డీసీఏ దాడులు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అనుమతులు లేకుండా సాగుతున్న ఏపీఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్) నెట్వర్క్ డ్రగ్ కార్యకలాపాలను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. దాడుల్లో 170 గ్రాముల యాంటీవైరల్ ఔషధం జిడోవుడిన్ను స్వాధీనం చేసుకున్నారు.
API Drug Network లో జిడోవుడిన్ స్వాధీనం
దాడుల సమయంలో సంస్థ యజమాని గాడే రామకృష్ణారెడ్డి వద్ద నుంచి 170 గ్రాముల యాంటీవైరల్ ఔషధం జిడోవుడిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడ లభ్యమైన వివిధ ఏపీఐలకు సంబంధించిన కొనుగోలు, విక్రయ ఇన్వాయిస్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు కొనసాగింపు
ఈ తనిఖీలను డీసీఏ డిప్యూటీ డైరెక్టర్-1 జి. శ్రీనివాస్ పర్యవేక్షణలో మెద్చల్ అసిస్టెంట్ డైరెక్టర్ బి. లక్ష్మీనారాయణ, ప్రశాంతినగర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆర్. గీతాంజలి నిర్వహించారు. ఈ వ్యవహారంపై అధికారులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read

