టేకాఫ్‌కు ముందు ఘటన
గంటకుపైగా ఆలస్యంగా బయల్దేరిన IndiGo విమానం
ముంబయి, జూన్ 6: బెంగళూరు నుంచి ముంబయికి బయల్దేరిన IndiGo 6ఈ-6283 విమానానికి శుక్రవారం పక్షి ఢీకొట్టింది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
పక్షి ఢీకొట్టిన వెంటనే పైలట్ విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అధికారులు అవసరమైన తనిఖీలు నిర్వహించారు. రెండు ఇంజిన్లను కూడా పరిశీలించారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ఎయిర్‌బస్ A321 నియో విమానం సురక్షితమని నిర్ధారించారు.
తనిఖీలు పూర్తయ్యే వరకు ప్రయాణికులు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఇంజిన్లు సహా పలు అంశాలను పరిశీలించడంతో విమానం మళ్లీ బయల్దేరడానికి గంటకుపైగా సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు తెలిపారు.
టేకాఫ్‌కు ముందు ఇండిగో విమానానికి పక్షి ఢీ
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, IndiGo 6ఈ-6283 విమానం సాయంత్రం 7.04 గంటలకు బెంగళూరు నుంచి ముంబయికి బయల్దేరాల్సి ఉంది. అయితే పక్షి ఢీకొట్టిన ఘటన కారణంగా ఆలస్యమై, చివరకు రాత్రి 8.46 గంటలకు గమ్యస్థానానికి బయల్దేరింది.
విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం వెంటనే తెలియరాలేదు. ఘటనపై ఇండిగో సంస్థ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read

