పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కూలిన సైనిక విమానం

June 10, 2026 11:53 PM
pok chopper crash

పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. ముజఫరాబాద్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది అందరూ మరణించినట్లు పాక్ సైన్యం ధ్రువీకరించింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది అందరూ అమరులయ్యారని పాక్ సైన్యం స్పష్టం చేసింది. మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు.

ఈ ప్రమాదంలో సుమారు 21 మంది భద్రతా సిబ్బంది మరణించారని, నీలం లోయ సెక్టార్‌కు అదనపు బలగాలను తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా తెలిపింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కూలిపోయిందని, ప్రమాద స్థలంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని నివేదికలు వచ్చాయి. ఈ ఘటనపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media