భారతదేశం: భారతదేశంలో గంజాయి (Cannabis) లీగల్ కాబోతోందా? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది. దేశంలోని కఠినమైన గంజాయి చట్టాలను (NDPS Act) సవరించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన 6 నెలల డెడ్‌లైన్ ఈ జూలై 2026తో ముగుస్తోంది. దీంతో కేంద్రం తీసుకోబోయే ‘కీ డిసిషన్’పై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
అసలు చట్టం ఏం చెబుతోంది?
నిజానికి మన దేశంలో గంజాయి అనగానే పూర్తి నిషేధం అనుకుంటారు కానీ అది అపోహ మాత్రమే. NDPS చట్టం ప్రకారం గంజాయి అమ్మడం, తాగడం ఇల్లీగల్ అయినప్పటికీ… మెడికల్, సైంటిఫిక్, మరియు ఇండస్ట్రియల్ (నార, విత్తనాల ఉత్పత్తి) అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో సాగు చేయడానికి చట్టంలో ఇప్పటికే పర్మిషన్ ఉంది. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఇండస్ట్రియల్, మెడిసినల్ అవసరాల కోసం దీనిపై ముందడుగు వేశాయి.
రిస్క్ ఏంటి?
అయితే, ఈ నాణేనికి మరో వైపు కూడా ఉంది. దేశంలో దాదాపు 3 కోట్ల మందికి పైగా గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నట్లు ప్రభుత్వ అఫీషియల్ డేటా చెబుతోంది.(NDPS Act) ఒకవేళ చట్టాలను సడలిస్తే అడిక్షన్ పెరిగిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా ఉంది. ప్రస్తుతం గ్లోబల్ ట్రెండ్ చూస్తే.. కెనడా, జర్మనీ లాంటి దేశాలు గంజాయిపై ఆంక్షలు సడలించాయి. ఈ నేపథ్యంలో అడిక్షన్ లాంటి రిస్క్‌లు రాకుండా, అటు మెడికల్ సెక్టార్‌కి మేలు జరిగేలా భారత్ ఎలాంటి బ్యాలెన్స్‌డ్ పాలసీ డిసిషన్ తీసుకోబోతుందనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.
also read



