అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్.. ‘‘పీరియడ్స్ వచ్చాయా?’’ అంటూ అవమానించేవాడు!

August 19, 2026 11:42 AM
Anupama Parameswaran speaking about her past relationship in an interview

రిలేషన్‌షిప్‌పై అనుపమ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

ఓ తమిళ ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడు ధృవ్ విక్రమ్‌తో రిలేషన్‌షిప్ గురించి ఆమె పలు విషయాలు వెల్లడించారు. అనుపమ, ధృవ్ దాదాపు రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు గతంలో వచ్చాయి.

వీరిద్దరూ కలిసి Bison సినిమాలో నటించారు.

‘‘ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా అతనే చెప్పేవాడు’’

తనను ధృవ్ చాలా కంట్రోల్ చేసేవాడని అనుపమ చెప్పారు.

ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే విషయాల్లో కూడా అతను సూచనలు చేసేవాడని వెల్లడించారు.

ఒకరోజు ఎంతో ప్రేమగా, మరోరోజు అపరిచితుడిలా ప్రవర్తించేవాడని ఆమె తెలిపారు.

తాజాగా అదే ఇంటర్వ్యూకు సంబంధించిన రెండో భాగం విడుదలైంది.

ఇందులో అనుపమ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు.

‘‘పీరియడ్స్ వచ్చాయా?’’ అంటూ అవమానించేవాడు

‘‘నేను ఒక యాక్టర్‌ని. లైఫ్‌లో చాలా ధైర్యంగా ఉంటాను. అలాంటి నన్ను చాలా ఇబ్బందిపెట్టాడు.

ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే ఒక మహిళనైనందుకు సిగ్గుపడే పరిస్థితిలోకి నన్ను నెట్టేశాడు’’ అని అనుపమ చెప్పారు.

తాను ఏదైనా మాట్లాడినా, అతని తప్పులను ప్రస్తావించినా, ప్రశ్నించినా.. ‘‘నీకు పీరియడ్స్ వచ్చాయా? లేదా నీకు ఇంకా డేట్ రాలేదా? మూడ్ స్వింగ్స్ కదా’’ అంటూ తక్కువ చేసి మాట్లాడేవాడని ఆమె తెలిపారు.

ఆ మాటలు తనను చాలా ఇబ్బంది పెట్టాయని, తనపై తనకే అసహ్యం కలిగేలా చేశాయని అనుపమ చెప్పారు.

‘‘ఒకప్పుడు 11 మంది పిల్లలను కనాలని కలలు కన్నా’’

‘‘ఒకప్పుడు నేను 11 మంది పిల్లలను కనాలని కలలు కన్నాను. కానీ ఇప్పుడు అసలు పిల్లలే వద్దు అనే స్థాయికి వచ్చాను.

ఒక అమ్మాయిగా పుట్టినందుకే నేను ఇన్ని మాటలు పడాలా అనిపించింది’’ అని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు.

అనుపమ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఆమె చెప్పిన విషయాల్లో నిజం లేకపోలేదని, ధృవ్ పైకి కనిపించేంత మంచివాడు కాదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media