మత్స్యకారులకు కూడా ఉపయోగం.. దక్షిణాసియాపై నిరంతర నిఘా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఇస్రో తాజాగా ప్రయోగించిన ISRO EOS-05 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. కక్ష్యలోకి చేరిన కొద్ది క్షణాల్లోనే తన పనిని ప్రారంభించినట్లు సమాచారం.
భూ పరిశీలనలో ప్రత్యేకత
ఇప్పటివరకు EOS భూ పరిశీలన ఉపగ్రహాలు ప్రధానంగా సూర్యానువర్తన కక్ష్యలో తిరుగుతూ ఉండేవి. అయితే EOS-05ను ఇస్రో భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
దీంతో ఇప్పటివరకు ఇస్రో అంతరిక్షంలోకి పంపిన భూ పరిశీలన ఉపగ్రహాలతో పోలిస్తే ఇది చాలా ఎత్తులో ఉంటుంది.
ఒక్కో ఇమేజ్ విడ్త్ కనీసం 15 మీటర్ల వ్యాసార్థం ఉంటుందని సమాచారం. అందుకే EOS-05ను ఇంత ఎత్తులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన భూ పరిశీలన ఉపగ్రహాల్లో ఇది చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.
ప్రతి 10 నిమిషాలకు ఒక చిత్రం
సాధారణంగా భూ దిగువ కక్ష్య, సూర్యానువర్తన కక్ష్యలో తిరిగే భూ పరిశీలన ఉపగ్రహాలు ఒకసారి చిత్రం తీసిన తర్వాత మరో చిత్రాన్ని తీయడానికి కొంత సమయం పడుతుంది. అలాగే వాటి పిక్సెల్ సైజు కూడా తక్కువగా ఉంటుంది.
అయితే EOS-05 భూ స్థిర కక్ష్యలో ఉంటూ 42 మీటర్ల వ్యాసార్థంతో ఫొటోలు తీయగలదని సమాచారం. హై రెజల్యూషన్ ఇమేజెస్‌ను క్యాప్చర్ చేయడంతో పాటు ప్రతి 10 నిమిషాలకు ఒక ఫొటో తీసే సామర్థ్యం దీనికి ఉంది.
విపత్తులు, తుఫాన్లపై ముందస్తు సమాచారం
వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను కూడా EOS-05 వేగంగా గుర్తించగలదు. విపత్తులు, తుఫాన్లు వంటి వాతావరణ పరిస్థితులను ముందుగానే పసిగట్టేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది.
మత్స్యకారులకు కూడా ఉపయోగకరం
EOS-05లో మత్స్యకారులకు ఉపయోగపడే టెక్నాలజీ కూడా ఉంది. సముద్రంలో మత్స్య సంపద ఎక్కడ ఎక్కువగా ఉందో గుర్తించి మత్స్యకారులకు సమాచారం అందించే సామర్థ్యం దీనికి ఉంది.
ఈ ఉపగ్రహం కేవలం భారతదేశాన్ని మాత్రమే కాకుండా దక్షిణాసియా మొత్తాన్ని గమనించనుంది. భారత ఉపఖండం మొత్తానికి 10 నిమిషాలకు ఒకసారి చిత్రాలు తీసి పంపగలదని సమాచారం.
పంటలు, నీటి వనరులపై నిఘా
EOS-05 సేవలు వ్యవసాయం, నీటి వనరులు, కాలుష్యం వంటి అనేక రంగాల్లో ఉపయోగపడనున్నాయి.
పంటల పరిస్థితిని గమనించడం, నీటి వనరులను పరిశీలించడం, కాలుష్యాన్ని గుర్తించడం వంటి పనుల్లో ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.
ఇస్రో వద్ద ఇప్పటికే ఉన్న ఉపగ్రహాలతో పోలిస్తే EOS-05 567 రెట్లు మెరుగైన భూ పరిశీలన ఉపగ్రహం అని సమాచారం. ప్రపంచంలో ఇంతటి సామర్థ్యం ఉన్న ఉపగ్రహాల్లో ఇదే మొదటిదిగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.



