రెండున్నర గంటలు గాల్లోనే చక్కర్లు.. చివరకు సురక్షితంగా ల్యాండైన ఇండిగో విమానం

August 22, 2026 1:16 PM

గాల్లోనే రెండున్నర గంటలు.. ప్రయాణికుల్లో తీవ్ర భయం

తిరుచ్చి నుంచి సింగపూర్‌కు వెళ్తున్న IndiGo విమానంలో శుక్రవారం (ఆగస్టు 21) సాంకేతిక సమస్య తలెత్తింది.

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్యను గుర్తించిన పైలట్లు తిరుచిరాపల్లి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించారు.

127 మంది ప్రయాణికులతో ఉన్న విమానం తిరిగి తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది.

అయితే వెంటనే కిందకు దిగకుండా సుమారు రెండున్నర గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

సురక్షిత ల్యాండింగ్ కోసం ఇంధనం తగ్గింపు

విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు అత్యవసర ల్యాండింగ్‌కు ముందు విమానం బరువును తగ్గించడం అవసరమవుతుంది.

ఇందులో భాగంగా అదనపు ఇంధనాన్ని ఖర్చు చేయడానికి పైలట్లు విమానాన్ని కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టించారు.

ఈ సమయంలో విమానాశ్రయ అధికారులు, ATC సిబ్బంది పైలట్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారని తిరుచ్చి విమానాశ్రయ డైరెక్టర్ గోపాలకృష్ణన్ తెలిపారు.

రాత్రి 9 గంటలకు సురక్షిత ల్యాండింగ్

విమానాశ్రయంలో పూర్తి అత్యవసర, భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత విమానం రాత్రి 9 గంటల ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం దిగిన వెంటనే ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.

అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందనే విషయాన్ని IndiGo వెల్లడించలేదు.

ఒక్కరోజు ముందే మరో ఘటన

ఇటీవలి కాలంలో IndiGo విమానంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. గురువారం (ఆగస్టు 20) ఢిల్లీ-మంగళూరు మార్గంలో నడుస్తున్న IndiGo విమానంలో రన్‌వేపై వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media