సమాచారం ఇచ్చిన వారికి 20 వేల డాలర్ల బహుమతి
న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలో పిజ్జా డెలివరీ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు Anshul Kuncha (28) హత్య కేసులో కీలక సమాచారం అందించిన వారికి పోలీసులు 20 వేల డాలర్ల బహుమతి ప్రకటించారు. నిందితుల అరెస్టు, శిక్షకు దారి తీసే సమాచారం ఇచ్చిన వారికి ఈ నగదు ఇస్తామని వెల్లడించారు.
ఖాళీ ఇంటికి పిజ్జా పంపించి ఉచ్చులోకి లాగిన దుండగులు
Anshul Kuncha అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నివసిస్తున్నారు. జూన్ 5 అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఉత్తర ఫిలడెల్ఫియాలోని ఖాళీగా ఉన్న ఓ ఇంటికి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లారు.
అక్కడ ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. తలకు వెనుక భాగంలో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు మృతిగా ప్రకటించారు.
కాల్పులు అత్యంత సమీపం నుంచే
ఫిలడెల్ఫియా పోలీసు శాఖ చీఫ్ ఇన్స్పెక్టర్ స్కాట్ స్మాల్ మాట్లాడుతూ, “అన్షుల్ నేలపై అపస్మారక స్థితిలో రక్తస్రావంతో పడి ఉన్నారు. తలకు తుపాకీ గాయం కనిపించింది” అని చెప్పారు.
“ఘటన స్థలంలో మూడు ఖాళీ బుల్లెట్ షెల్లు లభించాయి. అవి బాధితుడు పడి ఉన్న ప్రదేశానికి చాలా దగ్గరగా ఉన్నాయి. దీన్ని బట్టి కాల్పులు జరిపిన వ్యక్తులు బాధితుడికి అత్యంత సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది” అని ఆయన తెలిపారు.
Anshul Kuncha కుటుంబానికి భారత కాన్సులేట్ అండ
“ఫిలడెల్ఫియాలో భారతీయ పౌరుడు అన్షుల్ కుంచా అకాల మరణం మాకు తీవ్ర విషాదం కలిగించింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. కుటుంబ సభ్యులతో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. అవసరమైన అన్ని సహాయాలు అందిస్తున్నాం” అని ఎక్స్‌లో వెల్లడించింది.
also read

