ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పి. దోర్జే గ్యాంబా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (GRMB) చైర్మన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ చర్యల గురించి సీఎం వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో AWARE వ్యవస్థ ద్వారా జల వనరుల సమాచారాన్ని రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు.వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికలను కూడా వివరించారు.అలాగే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు. గత సీజన్‌లో కట్ట తెగిపోవడంతో రెండు రాష్ట్రాల్లోనూ వరదలు సంభవించి ప్రజలు ఇబ్బందులు పడిన విషయాన్ని ప్రస్తావించారు.పెద్దవాగు ప్రాజెక్టు కట్టను బలోపేతం చేయడానికి తెలంగాణతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు
