స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పెళ్లిళ్ల సీజన్‌తో పెరుగుతున్న డిమాండ్
భవిష్యత్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం?
పూర్తి వార్త
హైదరాబాద్: బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలు దారుల్లో ఇంకా సందిగ్ధ పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ, పెద్ద ఎత్తున తగ్గుదల మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ధరలు పెరిగిన రోజుల్లో మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కొనుగోలు దారులను ఆలోచనలో పడేస్తోంది.
చాలామంది ధరలు ఇంకా తగ్గుతాయని భావిస్తూ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం భిన్నంగా సూచిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ధరల స్థాయిలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. మరింత తగ్గుదల కోసం ఎక్కువకాలం వేచి చూస్తే ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
బంగారం ధరలపై అంతర్జాతీయ ప్రభావం
బంగారం ధరలు ఎప్పుడూ అంచనాలకు అనుగుణంగా కదలవు. పెరుగుతాయని అనుకున్న సమయంలో తగ్గవచ్చు. తగ్గుతాయని భావించిన సమయంలో ఒక్కసారిగా పెరగవచ్చు. అందుకే బంగారం మార్కెట్‌ను ముందుగా అంచనా వేయడం సులభం కాదు.
ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. శాంతి చర్చలు ముందుకు సాగడం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడటం వంటి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే క్రూడాయిల్ ధరలు కూడా తగ్గుతున్నాయి. ఈ పరిణామాలు బంగారం, వెండి ధరల దిశను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
పెట్టుబడిదారుల దృష్టి బంగారంపైనే
భారతీయుల వద్ద బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు. ఇది సురక్షిత పెట్టుబడిగా కూడా భావిస్తారు.
ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో చాలామంది బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు.
ఇటీవల పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిమాండ్ పెరిగితే ధరలు కూడా పైకి వెళ్లే అవకాశం ఉంటుంది.
పెళ్లిళ్ల సీజన్‌తో కొనుగోళ్లు జోరు
దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతోంది. ఈ సమయంలో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. కుటుంబాలు ముందుగానే నగల కొనుగోళ్లకు సిద్ధమవుతాయి.
దీంతో జ్యువెలరీ మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిమాండ్ పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో తాజా ధరలు
ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹1,33,890
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹1,46,070
- కిలో వెండి ధర: ₹2,54,900
అయితే బులియన్ మార్కెట్లో ధరలు రోజంతా మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వంటి అంశాల ప్రభావంతో మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొనుగోలు చేయాలా?
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాల అవసరాల కోసం బంగారం కొనాలనుకునే వారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలను పరిశీలించవచ్చు.
విష్యత్‌లో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ పరిస్థితులు మారడం వంటి కారణాలతో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
also read



