Iraq సమీప తీరంలో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ Safe Sea Vishnuపై ఇరానియన్ దళాలు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది మృతి చెందినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
దాడి జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టగా ట్యాంకర్‌లో ఉన్న ఇతర సిబ్బందిలో పలువురిని సురక్షితంగా రక్షించినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఈ సంఘటనతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
