అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి చేసిన “ఇరాన్‌ను స్టోన్ ఏజ్‌కు తీసుకెళ్తాం” అనే వ్యాఖ్యలకు ఇరాన్ సైనికాధికారి Seyed Majid Moosavi ఘాటుగా స్పందించారు.
ఇరాన్‌కు వేల ఏళ్ల పురాతన నాగరికత ఉందని, దాన్ని బెదిరింపులతో కూల్చలేమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కేవలం 250 సంవత్సరాల చరిత్రతో ఉన్న దేశమని, ఇలాంటి వ్యాఖ్యలు “హాలీవుడ్ భ్రమలు” (Hollywood Delusions) ప్రభావమేనని విమర్శించారు.అమెరికా నాయకుల యుద్ధభాష్యం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించదని, అలాంటి వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి.ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు నిదర్శనంగా మారాయి. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన “స్టోన్ ఏజ్” హెచ్చరికలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
