ప్రజా ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, నిర్ణీత గడువులో చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ పాల్గొని, జిల్లావ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 152 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.ఫిర్యాదు దారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లోనే సంప్రదించారు. ఫిర్యాదులను చట్టబద్ధంగా, నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎస్పీ, ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

